*****
1962 సంక్రాంతితో ప్రారంభమైన పత్రికా ప్రచురణ యిప్పటి వరకూ కొనసాగుతోంది. రంజని వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి దక్షిణామూర్తి, కార్యదర్శి చాడ గోపాలకృష్ణ నుంచి ప్రస్తుత అధ్యక్షులు చీకోలు సుందరయ్య , ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ వరకు ఇరవై ఏడు కార్యవర్గాలు రంజని నిర్వహణా బాధ్యతలు చేపట్టాయి….నలభై ఎనిమిది సంవత్సరాల రంజని చరిత్రలో సాహితీవేత్తలు,కవులు,గాయకులు,మహాఅవధానులు,విమర్శకులు,కథారచయితలు,ఉపన్యాసకులు,కులపతులు,నాటకప్రయోక్తలు,సంగీతవిశారదులు, కేంద్రరాష్ట్రసాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, సినిమా రచయితలు, కళాకారులు, కార్టూనిష్టులు, నవలారచయిత(త్రు)లు, దర్శకులు, నాట్యకళాస్రష్టలు, ఆంధ్రేతర భాషాపండితులు యెందరో రంజని వేదిక నలంకరించారు. ఇతర భాషాప్రముఖులలో డా. సచ్చిదానంద రౌత్రాయ్(ఒరిస్సా), జయకాంతన్ (తమిళం), హరీంద్రనాథ ఛటోపాధ్యాయ (బెంగాలీ, ఆంగ్లం), హరిభజన్ సింఘ్(పంజాబీ), దేవవ్రతదాస్ (అస్సామీ) .... తదితరులు రంజని వేదికనలంకరించారు. వీవీ గిరి రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ‘ ఫష్ట్ లేడీ ’ శ్రీమతి వీవీ. గిరి రంజని ని సందర్శించారు. సాహితీ సభలు, చర్చలు, గోష్టులు,కావ్యగానాలు, ఉపన్యాసాలు వివిధ సాహితీప్రక్రియల్లో పోటీలు, జంటనగర స్థాయి నుంచిజాతీయ స్థాయి వరకు నిర్వహించింది.తెలుగు మాతృభాష కాని వారికి తెలుగు బోధించే పథకాన్ని చేపట్టిన రంజని, ఐ.ఏ &ఏ.ఎస్. అధికారులకు తెలుగు బోధిస్తోంది.
పోటీలు :
1984 నుంచి ప్రతి యేటా రంజని- కుందుర్తి అవార్డుల పేరిట వచన కవిత్వంలో పోటీలు నిర్వహించి అవార్డుల ప్రదానం జరుపుతోంది. 1984 నుంచి 2008 వరకు బహుమతి పొందిన కవితలు ప్రచురించింది. రంజని-నందివాడ భీమారావు కథల పోటీ పేరిట1989 నుంచి 1993 వరకు కథల పోటీ నిర్వహించింది. ఇందులో బహుమతులు పొందిన కథలు ‘ మంచి కథ ’ లో చోటు చేసుకున్నాయి. రంజని ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఉదయం, నవ్య వంటి పత్రికలతో కలిసి సంయుక్తంగా అనేక పోటీలు నిర్వహించింది. 2008 నుంచి పూర్వ మహాగణకులు ఏ. సత్యవర్ధన సహకారంతో రంజని - విశ్వనాథ పద్య కవితా పోటీలు నిర్వహిస్తోంది.
2008 నుంచి పూర్వ మహాగణకులు నందివాడ భీమారావు సహకారంతో రంజని -నందివాడ భీమారావు కథల పోటీ తిరిగి నిర్వహిస్తోంది. 2008, 2009 సంవత్సరాలలో యెంపికైన కథలు ‘ బహుమతి కథ ’ లో చోటు చేసుకున్నాయి.
కార్యాలయాల రచయిత(త్రు) లకు ఆర్థిక సహకారం :
ఏజీ కార్యాలయాల రచయిత(త్రు) లకు తమ పుస్తక ప్రచురణ కోసం ఆర్థిక సహకారం అందించే సంకల్పంతో రంజని 2008 నుంచి ‘ రచయిత(త్రు) లకు ఆర్థిక సహకార పథకం ’ చేపట్టింది. ‘నచ్చిన కథ ’ అమ్మకాలతో శ్రీకారం చుట్టిన ఈ పథకం నుంచి మొదటి సారిగా 2008 లో సింగరాజు నాగలక్ష్మి ‘రంజని’ నుంచి అయిదు వేల రూపాయిల ఆర్థిక సాయం అందుకున్నారు. ఆమె 168 శివక్షేత్రాల వైభవం ‘ఐశ్వర్యం’ గ్రంథాన్ని ప్రచురించారు. తదుపరి రచయిత నడిమింటి జగ్గారావు తన కథా సంపుటి ‘ ప్రేమాన్వితం ’ వెలువరించడానికి ఈ ఆర్థిక సహాయాన్ని 2010 ఫిబ్రవరి లో అందుకున్నారు.
స్మారక ప్రసంగం :
రంజని మాజీ ఉపాధ్యక్షురాలు వి. సుమతి సౌజన్యంతో ప్రతి యేటా సెప్టెంబరులో ‘ రంజని -ఊట్ల రాధాకృష్ణ మూర్తి స్మారక ప్రసంగం ’ ఏర్పాటు చేయటానికి నిర్ణయించాం. తొలి ప్రసంగం 2008 సెప్టెంబరు 16న ఏర్పాటైంది.
ప్రచురణలు :
రంజని ప్రతి సంవత్సరం ఆంధ్రభారతికి అక్షర కుసుమాలను సమర్పిస్తూనే వుంది .వాటిలో మేలైనవిగా అందరి ప్రశంసలు పొందినవి...
1. పానుగంటి లక్షీనరసింహారావు పై ప్రత్యేక సంచిక
2. చలం, కొడవటిగంటి కుటుంబరావుల పై ప్రత్యేక సంచిక
3. కథా రంజని ( ప్రముఖుల కథల సంపుటి )
4. కథా యజ్ఞం ( కాళీపట్నం రామారావు గారి ‘‘ యజ్ఞం ’’ కథపై హెచ్ బీటీ వారి సహాయంతో ప్రచురించిన
వ్యాసాల సంపుటి )
5. రంజని -శ్రీశ్రీ ప్రత్యేక సంచిక ( శ్రీశ్రీ పై సమగ్ర సంకలనం )
6. గొంతులు చిగిర్చాయి (1984 నుంచి1988 వరకు రంజని -కుందుర్తి అవార్డులు పొందిన కవితా సంకలనం )
- రజతోత్సవ కానుక
7. రజత రంజని ( గత వందేళ్ళ తెలుగు సాహిత్యాన్ని సమగ్రంగా సమీక్షిస్తూ నలభై మంది రచయితలు
రాసిన విశిష్ఠవ్యాససంకలనం - రజతోత్సవ కానుక )
8. తోరణం ( నందివాడ భీమారావు రచనలు )
త్రిదశాబ్ద ఉత్సవ కానుకలు:
1. విశ్వకవిత (తెలుగు, 19 జాతీయ భాషలు, 40 ప్రపంచ భాషల్లో ప్రముఖ కవుల కవితా సంకలనం)
2. ముప్పయ్ కవితలు (1989_90 లలో రంజని_కుందుర్తి అవార్డులు పొందినవీ, ప్రశంసలనందుకున్నవీ ముప్పయ్ కవితలతో కవితాసంకలనం)
ముప్పయ్ మూడో సంవత్సర వేడుకల్లో :
1. ‘మంచికథ’ (41కథల సంకలనం)
2 ‘గమనం’(1991, 92, 93 సంవత్సరాల్లో రంజని_కుందుర్తి అవార్డులు పొందిన కవితాసంకలనం)
ముప్పయ్ ఆరో సంవత్సర వేడుకల్లో:
1. ‘ఆకాంక్ష’ (1994, 95, 96 సంవత్సరాల్లో రంజని_కుందుర్తి అవార్డులు పొందిన కవితాసంకలనం)
2. ‘అమ్మ’ (వివిధ కవులు అమ్మపై రాసిన వచన కవితల సంకలనం)
ముప్పయ్ ఏడో సంవత్సర వేడుకల్లో:
1. ‘నివాళి’ పేరుతో వచన కవితా పితామహుడు కుందుర్తి వ్యక్తిత్వం, సాహిత్యాలపై వ్యాససంకలనం ప్రచురించింది.
నాలుగు పదులవేడుకల్లో :
1. ‘కిరణం’ (1997 నుంచి 2000 వరకు రంజని_కుందుర్తి అవార్డులు పొందిన కవితాసంకలనం)
2. ‘మా ఊరు’ (వివిధ కవులు తమ పుట్టిన / పెరిగిన వూళ్ళపై రాసిన వచనకవితా సంకలనం)
3. ‘నచ్చిన కథ’ ( రంజని కథా సంకలనం)
నలభై మూడోసంవత్సర వేడుకల్లో:
‘స్పృహ’ (2001_03 సంవత్సరాల్లో రంజని_కుందుర్తి అవార్డులు పొందిన కవితాసంకలనం)
నలభై ఆరో వత్సర వేడుకల్లో:
‘జానపద సాహిత్యం _ మానవతా దృక్పథం’ ( జానపద సాహిత్యంపై సమగ్ర సంకలనం)
నలభై ఏడో వత్సర వేడుకల్లో:
1. ‘శేషేంద్ర శిఖరం’ (గుంటూరు శేషేంద్రశర్మ సాహిత్యం _ వ్యకిత్వం పై వ్యాసాల సంకలనం )
2. ‘ఒక నులివెచ్చని స్పర్శ ’(2004_07 సంవత్సరాల్లో రంజని_కుందుర్తి అవార్డులు పొందిన కవితాసంకలనం)
౩. ‘సినిమా చూద్దాం రండి’ (75 సంవత్సరాల తెలుగు సినిమా ప్రభావం పై 59వ్యాసాల సంకలనం )
నలభై ఎనిమిదో సంవత్సర వేడుకల్లో:
1. ‘వెండి వెలుగులు ’ ( పాతికేళ్ల రంజని_ కుందుర్తి అవార్డుల ప్రస్థానం,2008 కవితలు )
2. ‘కదిలే మబ్బులు _ కదని కొండలు ’ ( నందివాడ శ్యామల, భీమారావుల ఏడు పదుల ఆత్మకథాత్మక జీవన చిత్రణ)
3. ‘బహుమతి కథ ’( 2008, 09 సంవత్సరాలలో ‘ రంజని_ నందివాడ భీమారావు కథల పోటీ ’ లలో పురస్కారాలు పొందిన కథా సంకలనం)
ప్రదర్శనలు:
ప్రసిద్ధ కళాకారుల, కళాకారిణుల ప్రదర్శనలు యేర్పాటు చేయడమే కాక రజతోత్సవాల్లో వెయ్యేళ్లతెలుగుసాహిత్యరూపకాన్నిసురభిసాంకేతికసహకారంతోప్రదర్శించింది.33సంవత్సరాలవేడుకలసందర్భంగా రంజని ప్రదర్శించిన వెయ్యేళ్ల తెలుగు సాహిత్య రూపకం దూరదర్శన్ జాతీయ ప్రసారాల్లో ఇంగ్లీషు, హిందీవార్తల్లో మూడు నిమిషాలు చూపడం రంజనికి గర్వకారణం, ఆనందదాయకం. భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా పదిహేను రకాల పోటీలు నిర్వహించింది. నాలుగు రోజులపాటు ఉత్సవాలు, ప్రత్యేక సభలను నిర్వహించడం ముదావహం.
రంజని రచయితలు:
తెలుగు కథా వైభవానికి, నవలావికాసానికి, కవితాభ్యుదయానికి, పత్రికా రచనకి, సాంస్కృతిక కళారంగాలకూ తమ రచనలతో, సేవలతో తోడ్పడుతోన్న అనేకమంది రచయితలు రంజనికుటుంబీకులే.రంజనివ్యవస్థాపకులు కీ. శే. ఇసుకపల్లి దక్షిణామూర్తి మొదలు... మల్లాది వెంకట కృష్ణమూర్తి,పరుచూరి,డి. ప్రభాకర్, డా||పాలకోడేటి సత్యనారాయణ రావు, జె. ఉమామహేశ్వర రావు(సహవాసి ),కేకే మీనన్, వారాల కృష్ణమూర్తి, ఎమ్మెస్సార్ మూర్తి, సువర్చలా దేవి, పమ్మి వీరభద్రరావు, శంకరమంచి పార్థసారథి, మహంకాళి వెంకట రావు, తుంగతుర్తి విశ్వనాథం, బీకేఎల్ యెన్ ఆచార్య, కాళహస్తి రామకృష్ణ, చిలమకూరి రామబ్రహ్మం, గిడుగు రాజేశ్వర రావు, పి. నాగభూషణం, జీవీ సుబ్బరావు, గుమ్మ ప్రసన్న కుమార్, ఆశారాజు, సింగరాజు నాగలక్ష్మి, ఎ.శ్రీదేవి,భమిడిపాటి సోమయాజి,బీపీ సుందరరావు, భమిడివెంకటేశ్వర్లు, చీకోలుసుందరయ్య, వి.సుమతి, జాస్తిరమాదేవి, రమణమునిశ్రీనివాసరావు,మునిపల్లెలక్ష్మీరమణకుమారి,జీఎస్సెస్.శేషసాయి,నడిమింటిజగ్గారావు,జీఎన్వీ.సత్యనారాయణ, కేవీ. కిశోర్ కుమార్, పద్యకవి కుంపటి ఆదిశేషు, వీఎన్. మంజుల, అద్దేపల్లి రాధాకృష్ణ, ఆర్.ఎల్.ఎన్. ప్రసాద్, రాయప్రోలు రామచంద్ర మూర్తి, పుట్రేవు శ్రీనివాసరావు, ఆర్.మురళీకృష్ణ,బీవీ. వరలక్ష్మి,మట్టిగుంటవెంకటరమణ,గరికపాటిచంద్రశేఖర్,నందిరాజుపద్మలతాజయరాం,వేమూరిఉషాకుమా రి,నంద్యాలమురళీకృష్ణ,ఏఆర్.స్వామి,రాయసంప్రసన్నకుమారి,సజ్జారవీంద్రబాబు,దుర్గాప్రసాద్,ఎమ్.కే.పంటా,టీవీ.సత్యనారాయణ,ఆరెస్సెస్.రఘుప్రసాద్,టీఆర్.వెంకటేశ్వరరావు,విశ్వనాథసోమయాజి,కె.అనురాధ,కె.విజయ్, వంగీపురం పద్మనాభన్, ముళ్లపూడి భాస్కర శర్మ, జీవీకే శర్మ, మేళ్లచెరువు శ్రీనివాస్, ఆదిరాజు శ్రీనివాస ఫణీంద్ర, చయనం వీరాంజనేయులు, క్రోవి మురళీ కృష్ణ, కె.మార్కండేయ శర్మ, పసుపులేటి రాంబాబు,పి.ఎస్.ఎమ్. లక్ష్మి, కె లలితాదేవి.... వీరంతా రంజని కుటుంబీకులే!!!
‘రంజని’ వికాసానికి తోడ్పడిన ప్రముఖులు శ్రీయుతులు యు.ఎస్.అనంతన్, ఏ. సత్యవర్ధన, ఎ. రఘునాథరావు, సీహెచ్. భాస్కర రావు, నందివాడ భీమారావు, వీ. వేదకుమారి,ఆలమూరు శ్రీనివాస కుమార్, సుంకర బలరామ కృష్ణ, ఎల్. వీ. సుధీర్ కుమార్, గురజాడ శ్రీనివాస్, డీ. రాధాకృష్ణ మూర్తి, జే. రాజశేఖర్, టీ. సదాశివరావు, బీ. నారాయణ, కే. చల్లయ్య, గరిమెళ్ల రామ్మూర్తి, చెరుకూరి విఠల్ కుమార్, జేపీ. అప్పారావు, రాయప్రోలు శ్రీరామమూర్తి, రాయల సాంబశివరావు,.... యింకా అనేకమంది కార్యాలయ మిత్రులకు, సాహితీ బంధువులకు, సోదరసంస్థలకు, ప్రకటనదారులకు ‘రంజని’ సదా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
రంజని ఆవిర్భావం నుంచి నేటి వరకు ( తెలుగు సాహిత్య అకాడమీ ) సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్లోని పలుసాహితీసాంస్కృతిక సంస్థలు, ఆంధ్రప్రదేశ్సమాచార&పౌరసంబంధాలశాఖ,పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలతో సత్సంబంధాలు కలిగి వుంది… ******
RANJANIFIRST PRESIDENT SRI ESUKAPALLI DAKSHINA MURTHY GARI PHOTO MEE BLOGU LO UNCHAGALARU
రిప్లయితొలగించండి