శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ కార్యక్రమం 26-05-2011
‘మట్టిలాంటి నన్ను నా గురుదేవులు మాణిక్యం చేశారు. ఇతను కృష్ణ పాత్ర ఏమిటి? అన్నవారే నా క్రమశిక్షణ, నిజాయితీ, ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు. శ్రీకృష్ణుడిగా, శ్రీనాథుడిగా నేను సాధించిన విజయాలన్నీనాటకాభిమానుల ఆశీస్సులే ’ అంటూ గానగంధర్వ, అంతర్జాతీయ పౌరాణికరంగస్థల నటులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ ‘రంజని’ 2011 మే 26 న ఏర్పాటు చేసిన ‘నేను-నా శ్రీకృష్ణ పాత్రలు’ ప్రసంగ కార్యక్రమంలో ప్రధాన ప్రసంగం చేశారు. రాయబారం, శ్రీనాథుడు నాటకాల నుంచి ఆయన కొన్ని పద్యాలు గానం చేశారు. ఏజీలు శ్రీమతి వాణీ శ్రీరామ్, శ్రీ సాదు ఇజ్రాయిల్, రంజని అధ్యక్షుడు చీకోలు సుందరయ్య, ఉపాధ్యక్షుడు నంద్యాల మురళీకృష్ణ, ప్రధానకార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ, కోశాధికారి కుంపటి ఆదిశేషు, సభ్యులు విశ్వనాథ సోమయాజి, ఉషారాణి తదితరులు ఆయన్ని సత్కరించారు…..
మరిన్ని వివరాలకి 27-05-2011 శుక్రవారం నాటి క్రింది దినపత్రికలు చూడగలరు ఈనాడు,ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, సూర్య...
********
( 110501 )
very nice presentation by ranjani executive team thank you to all of you.
రిప్లయితొలగించండి